సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు నేడు, ఆదివారం వీరవాసరం మండలం పంజావేమవరం గ్రామంలో టిడిపి జనసేన బిజెపి ఉమ్మడి పార్టీ ఆధ్వర్యంలో విజయోత్సవ సభ జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అంజి బాబు ముఖ్యఅతిథిగా విచ్చేసి కేక్ కటింగ్ చేసారు. ఆయన మాట్లాడుతూ .. గత ప్రభుత్వంలో ఇక్కడ అభివృద్ధి ఏమీ జరగలేదని ఇప్పుడు నియోజవర్గం అంతా తిరిగి ప్రజల నుండి సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. జనసేన ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కొడుకులపూడి గోవిందరావు , టిడిపి ప్రధాన కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు జనసేన’చనమల్ల చంద్రశేఖర్ ఎంపీపీ దుర్గ భవాని మరియు పలువురు ఎంపీటీసీ సభ్యులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
