సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇరాన్ ,అమెరికా యుద్ధం కారణంగా దేశంలో ఎల్పజీ గ్యాస్ కొరత ఏర్పడిన నేపథ్యంలో దేశవ్యాప్తముగా . బుక్ చేసి దాదాపు 25 రోజులకు గానీ మరో గ్యాస్ సిలిండర్ రాని పరిస్థితులు నెలకొన్నాయి. కానీ ఏపీ ప్రజలకు ఇక గ్యాస్ సిలిండర్ల కోసం వారాల తరబడి వెయిట్ చేయాల్సిన అవసరం లేదని, గ్యాస్ బుక్‌ చేసిన మూడు రోజుల్లోనే గృహ అవసరాల కోసం సిలిండర్ ఇంటికి వస్తుందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ తాజగా నేడు, మంగళవారం స్పష్టం చేసింది. ఇటీవల కొత్తగా వైజాగ్ పోర్టుకు ఎల్పీజీ గ్యాస్ తో నౌక చేరుకోవడంతో రాష్ట్రంలోని రిఫైనరీలలో ప్రస్తుతం 14, 000 టన్నుల LPG నిల్వలు ఉన్నాయని.. ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దని స్పష్టం చేసింది. అయితే హోటల్స్ తదితర వ్యాణిజ్య అవసరాలకు మాత్రం ఇబ్బందులు తప్పవు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *