సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రుతుపవనాల ప్రభావం తో రాష్ట్ర వ్యాప్తంగా గోదావరి జిల్లాల్లో చెదురుమదురుగా గత వారం రోజులుగా వర్షాలు పడుతున్నాయి. అయితే ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వల్ల ఆంధ్రప్రదేశ్లో వచ్చే బుధవారం నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు వాతావరణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది., ఒకప్రక్క ఏరువాక పౌర్ణమి ముగియడంతో వ్యవసాయ పనుల్లో రైతులు సందడిగా ఉన్నారు మరోప్రక్క పశ్చిమ గోదావరి, కోనసీమ, తూర్పు గోదావరి,, ఏలూరు, అనకాపల్లి కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల జిల్లాల్లో ఈ భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు సమాచారం ఇచ్చారు. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలో మోస్తరు వర్షం ఉంటుందని పేర్కొన్నారు. ఇక పూర్తీ వర్షాకాలం వచ్చేసినట్లే..
