సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల హీరో జూనియర్ ఎన్టీఆర్ మీద టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ చేసిన బూతు వ్యాఖ్యలు ఆయన బహిరంగ క్షమాపణలు చెప్పినప్పటికీ ఇంకా పెద్ద దుమారమే రేపుతున్నాయి. తాజాగా తెలుగు రాష్ట్రాలలో జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘాల నేతలు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో వారు మాట్లాడుతూ.. స్వర్గీయ నందమూరి ఎన్టీఆర్ పోలికలతో పుట్టి.. ప్రపంచ గుర్తింపు సాధించి ఆస్కార్ స్థాయికి ఎదిగిన జూ ఎన్టీఆర్ లాంటి వ్యక్తిని ఒక టీడీపీ ఎమ్మెల్యే ఇలా అంటే ఉరుకొంటామా? క్షమాపణలు చెపితే సరిపోదు. సీఎం చంద్రబాబు వెంటనే ఆ ఎమ్మెల్యేను పార్టీ నుండి సస్పెండ్ చెయ్యాలి. గతంలో ఒక టీడీపీ ఎమ్మెల్యే (వంశీ) ఇలా మహిళను కించపరిస్తే నందమూరి కుటుంబ సభ్యులు అందరు ఏకం కాలేదా? మరి ఇప్పుడు జూ. ఎన్టీఆర్ తల్లిని దారుణంగా దూషిస్తే ఆ ఎమ్మెల్యే ను వదిలేస్తారా? హరికృష్ణ గారి భార్య షాలిని గారు ఏం పాపం చేసింది?. ఆ ఎమ్మెల్యే కు ఎటువంటి శిక్ష పడాలి? ఎన్టీఆర్ అభిమానులు తెలుగు దేశం పార్టీకి ఇప్పటి వరకు అండగా ఉన్నాం. ఎమ్మెల్యే ప్రసాద్ ను వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సిందే. లేదంటే మేం ఊరుకోం. గత 25 ఏళ్లుగా ఎన్టీఆర్ ను ఎంతో మంది టీడీపీ నేతలే అవమానిస్తున్నారు. ఇక ఊరుకునేది లేదు. మేం కదిలి వస్తే ఎలా ఉంటుందో చూస్తారు. ఎన్టీఆర్ అభిమానుల సంఘటిత శక్తి ఏమిటో చూపిస్తాం అంటూ డిమాండ్ చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *