సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ఆధార్ కార్డు లో చిన్న మార్పు చేసుకోవాలంటే కొందరికి చుక్కలు కనిపిస్తాయి. అటువంటి నిబంధలులో ఇకఫై ఆధార్ కార్డులో చిరునామాను మార్చు కోవడం మాత్రం చాల సులభతరం చేసారు. ఇంటి పెద్ద(హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ) అంగీకారంతో ఆధార్ పోర్టల్లో (ఆన్లైన్లో) చిరునామా సులువుగా మార్చుకోవచ్చని భారత విశిష్ట గుర్తింపు సాధికార సంస్థ(యూఐడీఏఐ) తాజగా ప్రకటించింది. ఇకపై కొత్త విధానంలో ఇంటి పెద్దతో సంబంధాన్ని ధ్రువీకరించే ఏదైనా పత్రం సమర్పించాల్సి ఉంటుంది. రేషన్ కార్డు, మార్కుల షీట్, మ్యారేజ్ సర్టిఫికెట్, పాస్ పోర్ట్ తదితర ధ్రువీకరణ పత్రాల్లో ఏదైనా ఒకటి సమర్పించవచ్చు . కానీ, ఇందులో ఇంటిపెద్ద పేరు, దరఖాస్తుదారుడి పేరు, వారిద్దరి మధ్య సంబంధం గురించి తప్పనిసరిగా ఉండాలి. online ఓటీపీ ఆధారిత ధ్రువీకరణ ద్వారా అడ్రస్ మారుతుంది. ఇంటిపెద్ద ఫోన్కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మారినవారికి సైతం చాల అవలీలగా ఆధార్ లో అడ్రస్ మార్పు జరుగుతుంది. .
