సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా రామ్మోహన్ నాయుడు ఏపీలో విమాన ఆశ్రయాలపై ప్రత్యేక ద్రుష్టి పెట్టారు. దీనిలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో ఎయిర్ పోర్ట్ తిరిగి ప్రారంభించేందుకు ప్రణాళిక పనులు జరుగుతుండగా.. మరో పక్క రాజమహేంద్రవరం సమీపంలోని మధురపూడి విమానాశ్రయ అభివృద్ధికి రూ.250కోట్లు కేటాయించారు. దేశంలో ఎక్కడికైనా ఇక్కడి నుంచి వెళ్లేలా విమానాశ్రయాన్ని సన్నద్ధం చేస్తున్నా రు. ఇప్పటివరకూ 72 సీట్లతో విమానాలు నడుస్తున్నాయి. ఇక డిసెంబరు 1 నుంచి 180 సీట్లు ఉన్న పలు ఎయిర్‌బస్సులు రాకపోకలు సాగించనున్నాయి. ఇప్పటికే టికెట్లు విక్రయిస్తున్నారు. వచ్చే డిసెంబర్ 1వతేదీ నుంచి రాజమహేంద్రవరం నుండి ముంబయికి 180 సీట్లతో రోజుకు రెండు ఇండిగో ఎయిర్‌బస్సులు ప్రారంభిస్తున్నారు. అదే నెల 12వ తేదీనుంచి ఢిల్లీకి రెండు ఇండిగో ఎయిర్‌బస్సులు అటూ తిరుగుతాయి. 1వ తేదీ సాయంత్రం 4.50కి ముంబాయి నుం చి బయలుదేరి 6:45గంటలకు రాజమహేం ద్రవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటుంది. రాజమహేంద్రవరంలో రాత్రి 7.15గంటలకు ఎయిర్ బస్సు బయలుదేరి రాత్రి 9.50 గంటలకు ముంబయి ఎయిర్‌పోర్టుకు చేరుతుంది. మొత్తం ప్రయాణ సమయం కేవలం 2.10 గంటలు. మరో ఎయిర్‌బస్ డిసెంబరు 12న ఢిల్లీలో ఉదయం 7.30 గంటలకు బయలుదేరి 9.45 గంటలకు రాజమహేంద్రవరం విమానాశ్రయానికి చేరుకుంటుంది. రాజమహేంద్రవరం ఎయిర్ పోర్టు లో ఉదయం 10.30 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం ఒంటిగంటకు ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు చేరుతుంది. ఇప్పటివరకూ మధురపూడి నుంచి హైదరాబాద్‌కు రోజూ అటూఇటూ 14 విమాన సర్వీసులు తిరుగుతున్నాయి. బెంగళూరుకు వైపు మరో 4 సర్వీసులు ఉన్నాయి. చెన్నైకు ఒక సర్వీస్ ఉంది. ఇక తిరుపతితో పాటు దగ్గర లోని విజయవాడ, విశాఖ కూడా సర్వీస్ లు వచ్చే 2025 లో ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
