సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రేపు గాంధీ జయంతి నేపథ్యంలో .. స్వచ్ఛత హి సేవా కార్యక్రమం లో పాల్గొనేం దుకు సీఎం చంద్రబాబు మచిలీపట్నం లో పర్యటిస్తారని మునిసిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ మీడియా సమావేశంలో తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం అమృత్ పథకానికి మ్యాచింగ్ గ్రాంట్ కేటాయించకపోవడంతో రాష్ట్రము అంతటా అమృత్ మంచినీటి కుళాయి కనెక్షన్లు నిలిచిపోయాయని మంత్రి ఆరోపించారు. గత రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంతో రూ.2290 కోట్లను కేంద్రం విడుదల చేయలేదని విమర్శించారు. బుడమేరు ఆక్రమణల వల్ల విజయవాడ కు భారీ వరద వచ్చిందని మంత్రి అన్నారు. ఆపరేషన్ బుడ మేరు మాదిరిగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని చోట్ల అక్రమ నిర్మాణాలపై దృష్టి పెడతామని తెలిపారు. ప్రభుత్వ స్థలాలు, చెరువులు, కాలువలు ఆక్రమించిన వారు స్వచ్ఛంద గా ఖాళీ చేయాలని హెచ్చరించారు. ఏ రాజకీయ పార్టీ వారైనా, ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదన్నారు..అయితే పేదవారిని ఇబ్బంది పెట్టకుండా టిడ్కో ఇళ్ల వంటి ప్రత్యామ్నాయం చూపిస్తామన్నారు. ప్రతిపక్ష పార్టీలకు విమర్శ లకు అవకాశం ఇవ్వకుండా ఆక్రమణ కూల్చివేతలలో ముందుకెళతామని స్పష్టం చేశారు.
