సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్ : ఇజ్రాయెల్ , పాలస్తీనా దేశాల మధ్య ఉద్రిక్తతలు తో పాటు యుద్ధ వాతావరణం నెలకొంది. నేటి శనివారం ఉదయం గాజా నుం చి ఇజ్రాయెల్ పైకి కేవలం 20 నిమిషాల వ్యవధిలో సుమారు 5000 రాకెట్లు దూసుకొచ్చాయి. పలు భవనాలు నేలమట్టం అయ్యాయి. అటు పాలస్తీనాకు చెందిన హమాస్ మిలిటెంట్లు చొరబాటుకు దిగారు. దీంతో అప్రమత్తమైన ఇజ్రాయెల్ సైన్యం ప్రతిదాడికి దిగింది. జెరూసలెం , టెల్ అవివ్ సహా దేశవ్యా ప్తంగా ఎయిర్ రైడ్ సైరన్ల మోత మోగింది. పాలస్తీనా మిలిటెంట్లు తమ భూభాగాల్లోకి చొచ్చు కొచ్చినట్లు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. సరిహద్దుల్లోని ప్రజలంతా ఇళ్లల్లోనే ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రావొద్దని హెచ్చరించింది. హమాస్ మిలిటెంట్స్ ఇతర ఇస్లామిక్ జిహాద్ గ్రూప్ ముఠాలు కూడా చేరినట్లు భావిస్తున్నారు. ఇజ్రాయిల్ లో ఉన్న భారతీయుల పట్ల భారత్ ఆందోళన వ్యక్తం చేస్తూ ఇజ్రాయెల్ కు సంఘీభావం ప్రకటించింది,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *