సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు లో నేడు, ఆదివారం పాలకొల్లు లో బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి టిడ్కో ఇళ్ళు కాలనీ ఇళ్లను పరిశీలించి అక్కడ లబ్ధిదారుల సమస్యలను అడిగి తెలుసుకొన్నారు. తమకు ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ళు బ్యాంకు తనఖా లో రాష్ట్ర ప్రభుత్వం పెట్టిందని దానితో తమకు 4 లక్షల చప్పున అప్పు ఉన్నట్లు కొందరు పిర్యాదు చేసారు. దానితో తగిన ఆధారాలు ఇస్తే ఈ విషయాన్ని కేంద్ర అధికారుల దృష్టికి తీసుకొనివెళతానని పురంధరేశ్వరి వారి భరోసా ఇచ్చారు. తదుపరి పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ.. దేశం లో సుపరిపాలన అందించగలిగే పార్టీ బిజెపి పార్టీ. ఏపీ రాష్ట్రా అభివృద్ధి కోసం కేంద్రం వేల కోట్లు నిధులు మంజూరు చేసింది.వైసీపి ప్రభుత్వం అధికారం లోకి వచ్చాక 3 రాజధానులు అంటూ ప్రాంతాలు కులాలు మధ్య విభేదాలు సృష్టిస్తుంది ప్రశ్నిస్తే ఎట్రాసిటీ కేసులు నమోదు చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో కేంద్రం అందించిన నిధులు, మంజూరు చేసిన వివరాలు తెలిపారు. జిల్లాలో 216జాతీయ రహదారి 316కోట్లతో నిర్మాణం,వశిష్ట నది పై వంతెన, బైపాస్ నిర్మాణం కోసం165నెంబర్ జాతీయ రహదారి నిర్మాణానికి భూసేకరణ నరసాపురం, భీమవరం రైల్వే స్టేషన్ లలో ఆధునిక మౌలిక సదుపాయాలు కోసం 75కోట్లు కేటాయించామని తెలిపారు. గుడివాడ -భీమవరం… రైల్వే డబ్లింగ్ తదితర అభివృద్ధికి 1200కోట్లుఇచ్చామని తేలిపారు. కోటి పల్లి నరసాపురం రైల్వే అభివృద్ధి.75శాతం నిధులు మంజూరు రాష్ట్ర వాటా చెల్లించడం లేదు అన్నారు, జిల్లాలో లక్షా 5వేలు ఇళ్ళు కేంద్ర నిధులతో మంజూరు చేస్తే జగన్ సర్కార్ ఎన్ని నిర్మాణం చేశారు? అని ప్రశ్నించారు. పాలకొల్లులో టిడ్కో ఇళ్ళు కాలనీ ల్లో మౌలిక సదుపాయాలు లేవు వీధి లైట్లు లేవు.టిడ్కో ఇళ్ళు తాకట్టు పెట్టి.బ్యాంకు రుణాలు వడ్డీ కట్టమంటోంది అని పురంధేశ్వరి తీవ్రంగా మండిపడ్డారు, ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాగి కాశీ విశ్వనాథ్ రాజు, రాష్ట్ర కార్యదర్శి భూపతిరాజు శ్రీనివాస వర్మ, జిల్లా అధ్యక్షుడు నార్ని తాతాజీ,తదితరులు పాల్గొన్నారు,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *