సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గోదావరి జిల్లాలలో భానుడి ప్రతాపం ప్రజలను అల్లాడిస్తోంది. మండు వేసవి ఉండే మే మాసంలో భారీ వర్షాలు, నైరుతి రుతుపవనాలు ప్రవేశించిన జూన్‌లో ప్రారంభం నుండి ఎండలు విపరీతంగా పెరిగాయి. 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు, వడగాలులు, విపరీతమైన ఉక్కపోత ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. ఒక ప్రక్క వర్షాలు అంటూ వాతావరణ శాఖ ప్రకటిస్తున్న గోదావరి జిల్లాలో మాత్రం గత 10 రోజులుగా వర్షం పడలేదు. ఎక్కడో కురుస్తున్న వర్షాలకు ఇక్కడ ప్రజలకు ఉక్కపోత బోనస్ గా మారిపోయింది. ప్రజలు పిల్లలు వడ దెబ్బ ఉడుకు జ్వరాల బారిన పడుతున్నారు. ఇదే వాతావరణం బాబోయ్ అంటూ భీమవరంలో మధ్యాహ్నం 12 గంటల నుండి 4 గంటల వరకు ప్రధాన రహదారులు సైతం నిర్మానుష్యంగా ఉంటున్నాయి వ్యాపార వర్గాలు కూడా బిజినెస్ తరువాత ఆరోగ్యం ముఖ్యం అని షాపులు కట్టేస్తున్నారు. ఆసుపత్రులు, చర్మ వ్యాధుల ఆసుపత్రులు మాత్రం కిటకిటలాడుతున్నాయి.
