సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: హైదరాబాద్ లో యోధ లైఫ్ లైన్ డయాగ్నోస్టిక్స్ సెంటర్ తెలుగు సినీ పరిశ్రమలోని అన్ని విభాగాల వారికి లైఫ్ హెల్త్ కార్డులను పంపిణీ చేసేందుకు ముందుకు వచ్చింది. సినీ పరిశ్రమలోని అందరికి 50 శాతం రాయితీతో టెస్టులు చేస్తామని ప్రకటించింది. అందులో భాగంగా జూబ్లీహిల్స్‌లోని చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌లో జరిగిన కార్డుల పంపిణీ కార్యక్రమం ను ముఖ్య అతిథిగా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘కరోనా ఎంతో మందిని బలి తీసుకుంది.రోగం వచ్చాక బాధపడేకంటే రోగ నిర్ధారణ చేసుకోవడం ఉత్తమం. హెల్త్‌ కార్డుల కోసం అడిగితే యోధ లైఫ్‌ లైన్‌ చైర్మన్‌ సుధాకర్‌ సానుకూలంగా స్పందించారు. కేవలం మెంబర్స్‌కు మాత్రమే కాకుండా కుటుంబ సభ్యులకు సైతం అవకాశం కల్పించారు. ఇప్పటివరకు 7,699 కార్డులు రెడీ అయ్యాయి. ఒమిక్రాన్ మహమ్మారి మళ్ళీ విజృంభిస్తుంది. షూటింగ్‌లో ఉన్నవాళ్లు అన్ని జాగ్రత్తలు తీసుకొని షూటింగ్‌లో పాల్గొనాలి. అంటూ ప్రతి దాంట్లో పెద్దరికంగా ఉండను..ఇద్దరు వ్యక్తులో, రెండు యూనియన్లో కొట్టుకుంటుంటే మాత్రం ఆ పంచాయితీలు నేను చేయను. దానికి ముందుకు రాను. ‘పెద్దరికం చేయడం నాకిష్టం లేదు, నేను సినీ పెద్దగా ఉండను..కానీ అవసరం వచ్చినప్పుడు నేనున్నాంటూ ముందుకు వస్తాను. కానీ అనవసరంగా తగుదునమ్మా అంటూ ముందుకు వచ్చే ప్రసక్తే లేదు. అని చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *