సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణ శివారు.. ఉండి నియోజకవర్గ పరిధిలో వేరు వేరు ఘటనలలో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి వారి నుంచి 348 గ్రాముల బంగారం, 5 మోటారు సైకిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌పి అద్నాన్ నయీమ్ అస్మి తెలిపారు. అజ్జమూరులోని ఆకివీడు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అయన మాట్లాడుతూ..కాళ్ళ మండలం పెద అమిరం లోని సిల్వర్ స్ర్పింగ్ విల్లాలో ఈనెల 4న దొంగతనం జరిగినట్లు గుర్తించిన యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఇంట్లో పనిమనిషిపై అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు ఉండి మండలం మహదేవపట్నం భవానీపురా నికి చెందిన బలిరెడ్డి వరలక్ష్మిని పోలీసులు అదుపులోనికి తీసుకుని విచారించారు. ఆమె వద్ద దొంగిలించ బడ్డ బంగారం 348గ్రాములు స్వాధీనం చేసుకొన్నారు.అలానే ఆకివీడు మండలం చినకాపవరంలో ఫ్రైడ్ షాపు నిర్వహిస్తున్న బైరే వీరాస్వామిని అరెస్టు చేసి 5 మోటారు సైకిల్స్ స్వాధీనం చేసుకునట్లు తెలిపారు. అక్కడ ఎవరికీ అనుమానం రాకుండా ఫ్రైడ్ షాపు నిర్వహిస్తూ మోటారు సైకిళ్లు దొంగతనానికి పాల్పడుతున్నట్లు ఆయన తెలిపారు. ప్రజలు ఇంటి నుండి దూరప్రాంతాలకు వెళ్ళేటపుడు పోలిసుల ద్వారా ఎల్‌హెచ్‌ఎస్ సదుపాయాన్ని వినియోగించుకోవాలని లేదా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఎస్పీ పేర్కొన్నారు.
