సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలకు అంతు లేకుండా పోయింది. ఈ క్రమంలోనే తాజాగా నేడు, సోమవారం నెల్లూరు జిల్లాలో ఇందుకూరుపేట మండలం గంగపట్నం వేపచెట్టు సెంటర్‌లో సైకిల్‌పై స్కూల్‌కు వెళ్తున్నఇద్దరు విద్యార్థులను ఢీకొట్టింది ఏపీఎస్ ఆర్టీసీ బస్సు. ఈ ప్రమాదంలో పులికిరణ్ (12) అనే విద్యార్థి అక్కడికక్కడే మృతిచెందగా అతని సోదరుడు కార్తీక్‌కి స్వల్ప గాయాలయ్యాయి. మృతుడు గంగపట్నం వెంకటరెడ్డి కాలనీకి చెందిన బాలుడుగా గుర్తించారు పోలీసులు. కొంతకాలం క్రితమే బాలుడు తండ్రి విద్యుదాఘాతంతో మృతిచెందారు. కొడుకు కూడా రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో మృతదేహం వద్ద తల్లి రోదనను ఎవరు ఆపలేకపోతున్నారు. ఈ ప్రమాదంపై నెల్లూరు జిల్లా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
