సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం స్థానిక DNR ఇంజనీరింగ్ కళాశాల ఇన్ఫోసిస్ కంపనితో ఎం.ఒ.యూ. ఒప్పందం కుదుర్చుకున్నామని ఈ ఒప్పందంవలన విద్యార్థులకు ఆధునాతన టేక్నాలజీస్ ఫై నిరంతర శిక్షణ ఇవ్వనున్నారు ఈరోజు శుక్రవారం మూడు మరియు నాల్గువ సంవత్సరం విద్యార్థులకు ఇన్ఫోసిస్ వారిచే ఆన్లైన్ అస్సెస్సెమెంట్ కార్యక్రమం జరిగిందని మరియు అతి తొందర్లో క్యాంపస్ ప్లేసెమెంట్స్ నిర్వహిస్తారని కళాశాల సెక్రటరీ గాదిరాజు సత్యానారాయణ రాజు బాబు తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎం. అంజన్ కుమార్ మాట్లాడుతూ ఈ అవకాశాన్ని సద్విని యోగించుకుని విద్యార్థులు ఉద్యోగాలు పొందాలని ఆకాంక్షించారు. ప్లేసెమెంట్ డైరెక్టర్ డా. సిహెచ్.రాంకిషోర్ మాట్లాడుతూ ఇన్ఫోసిస్ వారు విద్యార్థులకు స్టాఫ్కు ఆర్టిఫిసియల్ ఇంటలిజెన్స్ మరియు మెషిన్ లెర్నింగ్ మొదలైన వాటిపై శిక్షణ కార్యక్రమాలు ఇస్తారని మరికొన్ని బహుళజాతి కంపనీల ఒప్పందాలు పరిశీలనలో ఉన్నాయని అన్నారు. (up file photo)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *