సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విశాఖలో సీఎం జగన్ పర్యటించి పలు ప్రారంబోత్సవాలలో పాల్గొన్నారు. జీవీఎంసీ బీచ్ క్లీనింగ్ వాహనాలను ప్రారంభించి మాట్లాడారు. తదుపరి ఐటీ హిల్స్ వద్ద ప్రపంచ ప్రఖ్యాత ఐటి దిగ్గజ కంపెనీ ఇన్ఫో సిస్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఇక్కడ పనిచేస్తున్న వేలాది మంది ఉద్యొగులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భముగా ఆయన మాట్లాడుతూ.. విశాఖ త్వరలోనే దేశంలో ఐటి హబ్ గా మారుతుందని ,విశాలమైన ప్రకృతి రమణీయం అయిన సాగరతీరం పెద్ద ఎస్సెట్ అని.. తమ ప్రభుత్వ కృషితో ఇన్ఫోసిస్ వంటి మరిన్ని దిగ్గజ కంపెనీలు ఇక్కడ ప్రారంబిస్తున్నారని దీనితో లక్షలాది మంది యువకులకు ఉపాధి లభిస్తుందని, ఏ ప్రముఖ కంపెనీ తమకు ఫోన్ చేసిన వాటి ఏర్పాటుకు అన్ని వసతులు ఇక్కడ సమకూర్చేందుకు సిద్ధంగా ఉన్నా మన్నారు. త్వరలో ముంబయ్, బెంగళూర్, హైదరాబాద్ మాదిరి లక్షలాది ఇంజనీరింగ్ చదువుకొన్న యువకులకు ఉపాధి కలిపించే నగరంగా విశాఖ మారుతుందన్నారు. తాను కూడా డిసెంబర్ నాటికి విశాఖకు రాబోతున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర పరిపాలనా విభాగమంతా ఇక్కడికే వస్తుందని.. డిసెంబర్ నుండి ఇక్కడి నుంచి పాలన కొనసాగిస్తానని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *