సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, శనివారం గుడివాడలో కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ.. ‘జనసేన అధినేత పవన్ కల్యాణ్, చం ద్రబాబు పొలిటికల్ టూరిస్టులు. హైదరాబాద్ లో నివాసాలు ఉంటూ వీరిని ఛీ కొట్టిన ఆంద్ర్ ప్రదేశ్ ప్రజలలో ఉద్రిక్తలు తెచ్చగొట్టే నీచతత్వం వీరిది. పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో రెక్కీ డ్రామా చేస్తే దానికి ఇక్కడ ముఖ్య మంత్రి వైఎస్ జగన్ కు సంబంధమా? రెక్కీ పేరుతో పవన్ గాలిమాటలు మాట్లాడాడు. జూబ్లీహిల్స్ లో రెక్కీ జరిగితే చం ద్రబాబు దానికి వంత పాడతాడు. మొన్న పవన్ విశాఖలో ఐదు నానా హంగామా చేశారు. ఇప్పు డు ఇప్ప టం వెళ్లి మరోసారి పవన్ నానా హంగామా చేశారు. కేపీ పాల్ లాగా పవన్ ఇప్పటం లో పరుగులు పెట్టారు. మునుగోడులో హడావిడి పరుగులు పెట్టి కేఏ పాల్ ప్రజలకు వినోదాన్ని రక్తి కట్టించాడు. అయితే కేఏ పాల్ కన్నాతాను వెనకబడిపోయానని గ్రహించి పవన్ ఇప్పటం వచ్చాడు. ఆలా షో అయిపోగానే 2 గంటల కల్లా విమానం ఎక్కి వెళ్లిపోయారు.రాష్ట్రంలో లేని సమస్యలను పవన్, చంద్రబాబు సృష్టిస్తున్రు. ఏదైనాసమస్య ఉంటే ప్రభుత్వం దృ ష్టికి తీసుకువెళ్లాలి. రాష్ట్రం లో సంక్షేమ పాలన జరుగుతుం టే టీడీపీకి నిద్రపట్టడం లేదు. దానితో హైదరాబాద్ లో తాగుబోతులు పవన్ ఇంటి ముందు హడావుడి చేస్తే రెక్కీ అన్నారు. గులకరాయితో చంద్రబాబుపై హత్య యత్నం జరిగిందంట..వారిద్దరూ వాళ్ల సమస్య లతోనే సతమతమవుతున్నా రు.. పెట్రోల్, గ్యాస్ ధరలు రాష్ట్ర ప్రభుత్వం పెంచుతుందా?. మతిలేని మాటలు మాట్లాడతారు. ప్రధాని మోదీని అడిగే దమ్ము పవన్, చం ద్రబాబుకు లేదు. పవన్ ఒక రాజకీయ అజ్ఞాని..ఇప్పటం ప్రజలకు పవన్ కళ్యాణ్ ఇస్తానని చెప్పిన 50 లక్షలు అభివృద్ధి నిధులు ఇప్పటివరకు ఇవ్వలేదు అని అక్కడి ప్రజలు నిలదీస్తున్నారు.. దానికి సమాధానము చెప్పకుండా , ఆ ప్రాంతంలో 8 కోట్ల రూపాయలతో జగన్ సర్కార్ రోడ్ల విస్తరణ, డ్రైన్స్ నిర్మాణం చేస్తుంటే ఓర్వలేక వచ్చి హడావిడి చేసాడు అని విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *