సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గుంటూరు జిల్లా ఇప్పటంలో రోడ్డు విస్తరణలో భాగంగా రోడ్లు ఆక్రమించి నిర్మించారని మార్క్ చేసి ప్రభుత్వ అధికారులు సుమారు 50 నుండి 60 కుటుంబాలకు చెందిన ప్రహరీగోడలు, రేక్ షెడ్ లు కూల్చివేతకు గురైన నేపథ్యంలో ఇటీవల తీవ్ర ఆగ్రహంతో ఆ ప్రాంతంలో పర్యటించిన జనసేన అధినేత బాధితులను పరామర్శించారు. దీనిపై అధికార వైసిపి నేతలు మాట్లాడుతూ..గతంలో ఇప్పటం గ్రామానికి అబివృద్ధి నిమిత్తం ఇస్తానని పవన్ చెప్పిన 50 లక్షలు ఇప్పటివరకు ఇవ్వలేదని , తాము ఒక ఇల్లు కూడా కూల్చలేదని విమర్శలు చేస్తున్న తరుణంలో .. జనసేన నేత నాదెండ్ల మనోహర్ తాజగా ఏర్పటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఇప్పటం వెళ్లి బాధితులను పరామర్శించి, వారి ఆవేదనను విన్న పవన్ తాజాగా వారికి లక్ష రూపాయాల ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ మొత్తాన్ని త్వరలోనే పవన్ కళ్యాణ్ గారు స్వయంగా అందచేస్తారని అని తెలిపారు. వైసిపి ప్రభుత్వ దాష్టీకానికి ఇళ్ళు దెబ్బ తిన్నవారు, ఆవాసాలు కోల్పోయారన్నారు. పవన్ కళ్యాణ్ బాధితులకు తన వంతుగా ఆర్ధికంగా అండగా నిలబడాలని తమ అధినేత నిర్ణయించారని అన్నారు.
