సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల లండన్ వెళ్లి తిరిగి వచ్చిన మాజీ సీఎం జగన్ తొలిసారి తాడేపల్లి లో నేడు, బుధవారం విజయవాడకు చెందిన వైసీపీ స్థానిక నేతలు, కార్పొరేటర్లు సమావేశం లో మాట్లాడుతూ.. కేవలం 8 నెలల కూటమి పాలనకే సీఎం గా చంద్రబాబు ఇక మారరని ఇచ్చిన హామీలు నెరవేర్చలేరని మోసపోయామని ప్రజలకు అర్ధం అయిపోయిందని, అదే గతంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన 3 సంవత్సరాల తరువాత స్థానిక సంస్థల ఎన్నికలలో మునిసిపల్ చైర్మెన్, మేయర్ లు మొదలుకొని జడ్పీటీసీలు ఎంపీటీసీ లు సర్పంచ్లు అన్ని చోట్ల వైసీపీ అభ్యర్థులే క్లిన్ స్లీప్ చేస్తూ గెలిచారని అది ప్రజలకు వైసీపీ ప్రభుత్వం ఫై పెరిగిన నమ్మకం అని , ఇప్పుడు ఏవో సూపర్ 6 పధకాలు అంటూ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చాక ఉన్నపథకాలు కూడా మూసివేసిన చరిత్ర కూటమి సర్కార్ మూటకట్టుకోందన్నారు, ఇప్పటికి రాష్ట్రంలో స్థానిక సంస్థలలో ప్రజాప్రతినిధులలో వైసీపీ బలం, నిజాయితీ తిరుగులేనిదని, ఇటీవల అతి కష్టం మీద ప్రజా తీర్పు కు వ్యతిరేకంగా కేవలం 11 మునిసిపాలిటీలలో టీడీపీ పట్టు కోసం వైసీపీ కౌన్సెలర్స్ ను బెదిరించి ఎంత అరాచకం చేస్తారో అందరు చూసారని, ఇక జగన్ 2-0 ను వారికీ చూపిస్తానని పార్టీని ఎలా ముందుకు తీసుకొనివెళతానో మిరే చూస్తారు అని సవాల్ విసిరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ .. ఈ రాష్ట్రాన్ని 30 ఏళ్ల పాటు ఏలుతోందని జోస్యం చెప్పారు. అయితే కూటమి వాళ్ళు. దొంగ కేసులు పెడతారు.. అలాగే జైల్లో సైతం పెడతారని.. అయినా రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తామని వైసీపీ అధినేత,వైఎస్ జగన్ స్పష్టం చేశారు. అలాగే మనకు చెడు చేసిన వారినీ. ఎవరిని వదిలిపెట్టను వారికీ తగిన శిక్ష ఉంటుంది. ఇక జగన్ 2.0 వేరుగా ఉంటుందన్నారు. ఈసారి కార్యకర్తల కోసం జగన్‌ ఏం చేస్తాడో చూపిస్తాని తెలిపారు. గతంలో పార్టీ శ్రేణులకు అధిక ప్రాధాన్యత ఇవ్వ లేకపోయానని చెప్పారు.. అక్రమ కేసులు పెట్టిన వారిపై ప్రైవేట్‌ కేసులు వేస్తామని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *