సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వైజాగ్ లో నేడు, గురువారం కేంద్ర ఉక్కు శాఖ సహాయ మం త్రి ఫగ్గన్సింగ్ కులస్తే నగరం లోని పోర్టు కళావాణి స్టేడియం లో నిర్వహిం చిన రోజ్గార్ మేళాలో పాల్గొన్న నేపథ్యంలో .. విశాఖ ఉక్కు ప్యాక్టరీ ని కేంద్రం ప్రవేటు పరం చేస్తుందని వస్తున్నా వార్తలపై మాట్లాడుతూ.. ఇప్పటికిప్పు డు విశాఖ స్టీల్ ను ప్రైవేటుపరం చేయాలని కేంద్రం భావించడం లేదు. అంతేకాదు దీనిపై ప్రస్తుతానికి ముందుకెళ్లడం లేదు. దానికంటే ముందు రాష్ట్రీయ ఇస్పాత్ ని గమ్ లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్)ను బలోపేతం చేసే పనిలో ఉన్నాం . స్టీల్ ప్లాంట్లో కొన్ని కొత్త విభాగాలు కూడా ప్రారంభించబోతున్నాము. ప్యాక్టరీ కి కావలసిన ముడి ఖనిజాన్ని పూర్తీ అందుబాటులోకి తెచ్చే ప్రక్రియపై దృష్టి పెట్టాం . పూర్తిస్థాయి సామర్థ్యం మేరకు ప్లాంట్స్ నిచేసే ప్రక్రియ జరుగుతోంది. దీనిపై ఆర్ఐఎన్ఎల్ యాజమాన్యం , కార్మిక సంఘాలతో చర్చిస్తాం. ఆర్ఐఎన్ఎల్అధికారులతో భేటీ అవుతున్నాం. అయితే ఇటీవల తెలంగాణ ప్రభుత్వం బిడ్డిం గ్లో పాల్గొనడం అనేది వారికీ ఓ ఎత్తుగడ మాత్రమే’’ అని కొట్టిపారేశారు. మొత్తానికి ఒక్కసారిగా ఇంతమార్పు కేంద్రానికి రావడం వెనుక అసలు వాస్తవాలు లోక్ సభ ఎన్నికలు సమీపిస్తుండటమేనా? విశాఖ స్టీల్ కార్మిక ఉద్యమ ప్రభావం దేశం అంతా పడుతుందన్న భయమా?
