సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: పాకిస్థాన్ మాజీ ప్రధాని, ఒకనాటి పాకిస్తాన్ అచ్యుత్తమ క్రికెట్ కెప్టెన్ ,1992 ప్రపంచ క్రికెట్ కప్ విజేత కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ ( imran khan) కొంత కాలంగా రావల్పిండిలోని జైలులో దుర్భర జీవితం అనుభవిస్తోన్న విషయం తెలిసిందే. కొద్దీ రోజులుగా ఆయన ఆరోగ్య పరిస్థితిపై అనధికార వార్తలు వినిపిస్తున్నాయి. ఆయనను కుటుంబ సభ్యులను కూడా అనుమతించక పోవడంతో ఆయన పార్టీ క్యాడర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఇదిలా ఉండగా ఆయన కుడికన్ను చూపు 85 శాతం కోల్పోయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్‌కు అంతర్జాతీయంగా మద్దతు దక్కుతోంది. అతడికి మెరుగైన చికిత్స అందించాలంటూ భారత దిగ్గజ క్రికెటర్లు కపిల్ దేవ్, సునీల్ గావస్కర్..( kapildev, gavskar) తాజగా పాక్ ప్రభుత్వాన్ని కోరారు.ఈ నేపథ్యంలో 14 మంది ప్రపంచ స్థాయి మాజీ క్రికెటర్స్ సంతకాలు చేసిన ఓ ప్రకటనను మీడియాకు విడుదల చేశారు. వారిలో టీమిండియా మాజీ కెప్టెన్లు కపిల్ దేవ్, సునీల్ గావస్కర్‌తో పాటు ఆయా దేశాల మాజీ కెప్టెన్లు మైఖెల్ అథర్టన్, అలన్ బోర్డర్, మైఖెల్ బ్రేర్ లీ, గ్రెన్ చాపెల్, ఇయాన్ చాపెల్, బెలిందా క్లాక్, డేవిడ్ గ్రోవర్, కిమ్ హ్యూస్, నాజిర్ హుస్సేన్, క్లైవ్ లాయిడ్, స్టీఫెన్ వా, జాన్ రైట్ ఉన్నారు. ‘ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య విషయంలో పాక్ ప్రభుత్వం మానవతా దృక్పథంతో, న్యాయ పూర్వకంగా వ్యవహరించాలి. జైల్లో ఉన్న ఆయన ఆరోగ్యం క్షీణిస్తోందన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి’ అని వారు విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు.
