సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఒకనాడు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్న సూపర్ క్రికెటర్, పాకిస్థాన్ మాజీ ప్రధాని, తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ చీఫ్ ఇమ్రాన్ ఖాన్‌ (Imran Khan)ను జైలులోనే హతమార్చారంటూ సోషల్ మీడియాల్లో తాజగా నేడు బుధవారం మధ్యాహ్నం నుండి దిగ్భ్రాంతికరమైన కథనాలు వీటికి సంబంధించినవిగా చెబుతున్న ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇమ్రాన్ సోదరీమణులు గత మంగళవారంనాడు ఆయనను కలిసేందుకు ప్రయత్నించినప్పటికీ అధికారులు నిరాకరించడంతో ఇమ్రాన్ జైలులోనే మరణించారనే వార్తలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. 2023 నుంచి అడియాలా జైలులో ఉంటున్న ఇమ్రాన్ ఖాన్‌ను జైలులో కిస్థాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ, అసిమ్ మునీర్ కలిసి చిత్ర హింసలు పెట్టి హతమార్చినట్టు బలూచిస్థాన్ విదేశాంగ శాఖ తమ ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేసింది. అయితే ఈ కథనాలను అధికారింగా ఇంకా ఎవరూ ధ్రువీకరించలేదు. ఇది నిజమైతే మాత్రం పాకిస్తాన్ లో మరో సంక్షోభం తప్పదు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *