సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రపంచంలో పెట్రోల్ ఉత్పత్తులకు కీలకమైన దేశం ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన వార్తలు వెలువడిన వెంటనేచమురు ఎక్కువ ఉత్పత్తి చేసే మధ్య ప్రాచ్య ప్రాంతంలో రాజకీయ అనిశ్చితి మధ్య పెట్రోల్ ఉత్పత్తులతో పాటు బంగారం ఆల్-టైమ్ హైని తాకింది. భారతీయకాలమానం ప్రకారం నేటి సోమవారం మధ్యాహ్నం 1:41 గంటల సమయానికి స్పాట్ బంగారం ఔన్సు ధర1 శాతం పెరిగి2,438.44 డాలర్లకు చేరుకుంది. అంతకుముందు సెషన్లో రికార్డు గరిష్ట స్థాయి 2,449.89 డాలర్లను తాకింది. యూఎస్ గోల్డ్ఫ్యూచర్స్ 1.1 శాతం పెరిగి 2,442.60 డాలర్లకు చేరుకుంది. వెండికూడా 11 సంవత్సరాల కంటే ఎక్కువ గరిష్ట స్థాయికిచేరుకుంది. ముడిచమురు ధరలు నేటి మధ్యాహ్నం 12:02 గంటల సమయానికి బ్రెంట్ బ్యారెల్ కు 41 సెంట్లు లేదా 0.5 శాతం పెరిగి84.39 డాలర్లకు చేరుకుంది, అంతకుముం దు 84.43 డాలర్లకి పెరిగింది. మే10వ తేదీతర్వాత ఇదే అత్యధికం. ఎన్నికల పూర్తీ అయ్యాక జూన్ నెలలో పెట్రోల్ ధరలు భారత్ లో కూడా మరింత పెరిగే అవకాశం? నిరక్షిస్తుంది.
