సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: యుద్ధం లో ఇరాన్ విజృంభణ ఆపకపోతే ఇక విద్యుత్ ప్లాంట్లు తో పాటు దేశం మొత్తంపై బీకర దాడులు చేయబోతున్నామని ఇదే ఆఖరి హెచ్చరిక అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన 2రోజుల గడువును ఇరాన్ పట్టించుకోకపోవం , ఇటువంటి హెచ్చరికలు చేస్తే ఇంతటితో వదలం అని అమెరికా పౌరులు వారి పిల్లలు కూడా మూల్యం చెల్లించుకోవాలని ఇరాన్ ప్రతి హెచ్చరిక చేసిన నేపథ్యంలో ట్రంప్ గడువును మరో రోజుకు పొడిగించారు. (రేపటి మంగళవారం) రాత్రి 8 గంటల. ఈ గడువు లోపు ఇరాన్ ఒక నిర్ణయానికి రావాలని ఆయన హెచ్చరించారు. ఈ లోపే ప్రపంచ దేశాలు యుద్ధం నివారించడానికి మధ్యవర్తులు ఇరు దేశాల మధ్య 45 రోజుల యుద్ధ కాల్పుల విరమణ ఒప్పందాన్ని తెరపైకి తెచ్చారు. ఇది కొంత ఉపశమనంగానే కనపడుతుంది. ఇరు దేశాలు ఎటువంటి దాడులకు పాల్పడకుండా 45 రోజుల పాటు కాల్పుల విరమణ పాటించాలి. ఈ సమయంలో వివాదాస్పద అంశాలపై ఇరు దేశాల ప్రతినిధులు ముఖాముఖి చర్చలు జరిపి శాశ్వత పరిష్కారాన్ని వెతకాలి. ఈ చర్చల్లో ఖతార్, ఒమన్ వంటి దేశాలు కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *