సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇజ్రాయిల్ ఇరాన్ మధ్య యుద్ధం ముగించడం పోయి .. అమెరికా అడ్జక్ష్యుడు ట్రంప్ స్వయంగా ఇరాక్ ఫై దాడులు చేయించడంతో యుద్ధం సద్దుమణక అక్కడ పెట్రోలు పోసి మరింత పెంచినట్లయింది. అమెరికా ను చావు దెబ్బ కొట్టి తీరుతామని ఏ సమయంలో నైనా దాడి చేసి తీరుతామని ఇరాన్ హెచ్చరించడం, మరో ప్రక్క ఐక్యరాజ్య సమితి కూడా అమెరికా ను తప్పు పట్టడం, రష్యా, చైనా తో సహా సౌదీ అరేబియా , పాకిస్తాన్ తో సహా అమెరికా ను హెచ్చరించడం తో అమెరికా సందిగ్ధం లో పడిపోయింది. భారత ప్రధాని మోడీ కూడా ఇరాన్ అడ్జక్షుడిని ఫోన్లో గంటకు పైగా మాట్లాడి అక్కడి పరిస్థితుల పట్ల తన సానుభూతి వ్యక్తం చేసి ఇజరయిల్ తో ఉద్రిక్తలు తగ్గించాడనికి తాను ఇరాన్ కు సహకరిస్తానికి మాట ఇచ్చారు. ట్రంప్ తప్పు చేసారని అతనిని శిక్షిస్తామని , అణు స్థావరాలపై అమెరికా దాడులకు ప్రతీకారంగా హార్ముజ్ జలసంధిని మూసేస్తామని ఇరాన్ హెచ్చరించింది. ఈ ప్రకటన ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ముడి చమురు, సహజ వాయువు రవాణాకు కీలకంగా ఉన్న ఈ జలమార్గాన్ని మూసేస్తే ప్రపంచవ్యాప్తంగా పెట్రోలు ధరలు పెరిగి తీవ్ర ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తుతాయి. ఇప్పటికే భారత్ తో సహా స్టాక్ మర్కెట్స్ కుప్పకూలుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆందోళనకు గురయిన అమెరికా కూడా తన శత్రువు చైనా సాయం కోరింది. ఇరాన్ మనసు మార్చాలని అభ్యర్థించింది. ఈ విషయాన్ని అమెరికా విదేశాంగ శాఖ సెక్రెటరీ మార్కో రూబియో ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్వయంగా పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *