సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, సోమవారం ఉదయం నుండి దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. మార్కెట్లోని ప్రధాన సూచీలు మొత్తం దిగువకు పయనిస్తున్నాయి. మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తత సహా పలు అంశాలు స్టాక్ మార్కెట్‌పై ప్రభావం చూపినట్లుగా తెలుస్తోంది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం మొదలయిన నేపథ్యంలో గ్లోబల్ సెంటిమెంట్ బలహీనపడింది. దీంతో ఉదయం 9.19 గంటలకు బీఎస్ఈ సెన్సెక్స్ 636 పాయింట్లు లేదా 0.86% క్షీణించి 73,608 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ190 పాయింట్లు లేదా 0.84% క్షీణించి 22,330 వద్ద ట్రేడవుతోంది. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ, నిప్టీ మిడ్ క్యాప్ సూచీలు కూడా వరుసగా 537, 911 పాయింట్లు కోల్పోయాయి.
