సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్:పాకిస్తాన్ మధ్యవర్తిత్వం లో అమెరికా-ఇరాన్ మధ్య జరిగిన శాంతి చర్చలు విఫలం కావడంతో పశ్చిమాసియాలో పరిస్థితి మళ్లీ ఉద్రిక్తంగా మారింది. యుద్ధం లోనే కాదు చర్చలలో కూడా ఇరాన్ తన డిమాండ్ లలో ఎక్కడ తగ్గకపోవడంతో ఇస్లామాబాద్‌లో 21 గంటల పాటు జరిగిన కీలక చర్చలు ఫలితం లేకుండా ముగిశాయి. అణు కార్యక్రమం, హార్ముజ్ నియంత్రణ,తన దేశ హక్కు అని, తన దేశం నిధులను బ్యాంకులలో అమెరికా సీజ్ చెయ్యడం తప్పని అని ఇరాన్ ప్రతినిధులు పేర్కొనడం తో వంటి అంశాల్లో విభేదాలు తలెత్తాయి. చర్చలు విఫలమైన తర్వాత ట్రంప్ చేసిన ఓ పోస్ట్ పలు అనుమానాలకు తావిస్తోంది తమ డిమాండ్లను అంగీకరించకపోతే ఇరాన్ నౌకలను దిగ్బంధించే అవకాశం ఉన్నట్టు చెబుతున్న ఓ మీడియా కథనాన్ని నేడు, ఆదివారం ట్రంప్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. దీంతో చమురు ఎగుమతులపై ఆధారపడిన ఇరాన్ ఆర్థిక వ్యవస్థ పతనమవుతుంద’ని ఓ మీడియా సంస్థ రాసిన కథనాన్ని ట్రంప్ పోస్ట్ చేశారు ఇదే జరిగితే ఇరాన్ నుంచి చమురును దిగుమతి చేసుకుంటున్న చైనా, భారత్ వంటి దేశాలకు ఇబ్బందులు తప్పవు.
