సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: స్వదేశంలో ఆందోళనలతో అట్టుడుకుతున్న ఇరాన్ దేశంపై అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ సైనిక చర్య చేపడతారని ప్రస్తుతం అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ నాయకత్వం ట్రంప్‌తో చర్చలు జరపడానికి సిద్ధమైంది. దీనికి ట్రంప్ కూడా సుముఖత వ్యక్తం చేశారు. ఇదే సమయంలో ట్రంప్ ఇరాన్ తో వ్యాపారం చేసే దేశాలపై 25 శాతం అదనపు సుంకాల కొరడా విదిలించారు. ఇరాన్ నుంచి ఎక్కువగా వాణిజ్యం చేసే దేశాల్లో చైనా, భారత్ తుర్కియే, యూఏఈ, ఇరాక్,ముందు వరసలో ఉన్నాయి (US tariffs on Iran ). ట్రంప్ నిర్ణయంతో భారత్ కు మరిన్ని ఇబ్బందులు పెరిగాయి. ఇరాన్ నుంచి భారత్‌కు పెట్రోలియం ఉత్పత్తులు, వ్యవసాయ, ఆహార ఉత్పత్తులు, రసాయనాలు, పిస్తా, ఖర్జూరం వంటి డ్రైఫ్రూట్స్, ఐరన్, స్టీల్ వంటి ఉత్పత్తులు దిగుమతి అవుతాయి (Trump sanctions Iran). భారత్‌ నుంచి ఇరాన్‌కు బియ్యం, టీ పౌడర్, పంచదార, అరటిపళ్లు, ఫార్మా ఉత్పత్తులు, ఆర్గానిక్ కెమికల్స్, ఇంజినీరింగ్ వస్తువులు, మెటల్ ఉత్పత్తులు, బట్టలు, మిరియాలు వంటి ఉత్పత్తులు ఎగుమతి అవుతాయి. మరి ఇరాన్‌తో భారత్ వాణిజ్యం ఫై ఏ నిర్ణయానికి రానుందో? చూడాలి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *