సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమాసియా యుద్ధంలో ఎందరో సమిధలు అవుతున్నారు.ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. గాయాలకు తోడు కరువు తాండవిస్తుంది. ఎన్నో కన్నీటి గాధలు.. ప్యూహాత్మకంగా 15 రోజులు యుద్ధ విరామం ప్రకటించిన ట్రంప్.. అయినా ఇరాన్ ఫై భూమి మీదుగా దాడి చెయ్యడానికి చుట్టూ ప్రక్కల గల్ఫ్ దేశాల మీదుగా, సముద్ర మార్గాల ద్వారా అమెరికా సుమారు 15 వేల మంది సైన్యం ఇరాన్ సరిహద్దులకు మోహరిస్తుందని? వస్తున్నా వార్తల నేపథ్యంలో.. తాజాగా దుబాయ్‌లోని అమెరికాకు చెందిన రెండు రహస్య సైనిక స్థావరాలపై ఇరాన్ దాడులు చేసినట్టు అక్కడ దాదాపు 500 మంది అమెరికా సైనికులు ఉన్నారని ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కోర్ (IRGC) ప్రకటించింది. తమ దాడుల నేపథ్యంలో చాల మంది చనిపోవడం జరిగిఉంటుందని,అమెరికన్ సైనికులను రక్షించేందుకు దుబాయ్‌లోని అంబులెన్స్‌లు గంటల తరబడి పనిచేశాయని ఈ విషయం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పాటు అక్కడి సైనిక కమాండర్లకు అర్థమయ్యే ఉంటుందని ఐఆర్‌జీసీ కమాండర్ పేర్కొన్నారు. తమ ఇరాన్ భూ భాగంపై అడుగుపెట్టే ప్రతి అమెరికా సైనికుడిని వేటాడి చంపుతామని గల్ఫ్ దేశాలపై తమ దాడులు ఆగాలన్నా, ప్రశాంతత నెలకొని అభివృద్ధి జరగాలన్నాఅమెరికా కు సహకరించడం మానుకోకపోతే తగిన శాస్తి చేస్తామని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ హెచ్చరిక జారీచేశారు
