సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భూమి మీద మనుష్యులు ఉన్నట్లే వేరే గ్రహాలపై గ్రహాంతరవాసులు ఉన్నారు అని అందరికి తెలిసిందే.. అయితే వారు మన భూ గ్రహం మీదకు పలుమారులు ఎగిరే పళ్ళాలలో వచ్చినట్లు పలు అధికారికంగా కనపడినప్పటికీ ఆయా దేశాలు మాత్రం అధికారికంగా ప్రకటించడానికి అంగీకరించవు. అయితే తాజగా గ్రహాంతరవాసులు ఉన్నారు అని అమెరికా ఇటీవల అధికారికంగా ధ్రువీకరించినప్పటి నుంచీ ప్రజల్లో ఎన్నో ప్రశ్నలు. అయితే నిజంగా .. గ్రహాంతరవాసులవిగా చెబుతున్న రెండు కళేబరాలను పాత్రికేయుడు, గుర్తుతెలియని ఎగిరే వస్తువుల(యూఎ్‌ఫవో) రంగ నిపుణుడు జేమీ మౌసన్‌ మెక్సికోలో తాజాగా ప్రదర్శించారు. ‘ఆయన మాటలలో.. పెరూలోని కుస్కో నగరంలో గనుల్లో ఇవి బయటపడ్డయి. ఈ రెండు కళేబరాలను ఇక్కడి అటానమస్ నేషనల్ వర్సిటీ ఆఫ్ మెక్సికో పరిశోధకులు అధ్యయనం చేశారు. ఇవి వెయ్యేళ్ల క్రితానికి చెందినవని నిర్ధారించారు. ఆస్మియం వంటి అరుదైన లోహాలు వీటి వేలికి, కొన్ని అవయవాలకు ఉన్నాయి’’ అని జేమీ తెలిపారు. ఈమృతదేహాలకు తీసిన ఎక్స్‌రేలనూ ప్రదర్శించారు. రెండింటిలో ఒక దేహంలో మూడు అండాలు ఉన్నాయని ఆయన వివరించారు. ఈ కార్యక్రమానికి హాజరైనవారిలో పలు రంగాల పరిశోధకులు, మెక్సికో చట్టసభల సభ్యులు, అమెరికాకు చెందిన నిపుణులు హాజరు అయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *