సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు కు స్థానిక భవన నిర్మాణ కార్మికులైన మాకు గత కొన్ని నెలలుగా ఇసుక దొరకక పనులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నామని, రాత్రి పూట కాకుండా పగలు ఇసుక వెబ్ సైట్ ఓపెన్ అయ్యేలా చేసి మా సమస్యలను పరిష్కరించాలని భీమవరం తాలూకా తాపీ పని వారల యూనియన్ అధ్యక్షులు మెర్ల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి కటకంశెట్టి ఏడుకొండలు ఇతర సభ్యులు కోరారు. విన్నతి పత్రం సమర్పించారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ను కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. వారు మాట్లాడుతూ.. ఇసుకను 5 యూనిట్లు బ్లాక్ లో రూ 30 వేలకు అమ్ముతున్నారని, దాని వల్ల యజమానులు ఎవరూ ముందుకు రావటం లేదని, ఇసుక బుకింగ్ ఆన్లైన్ చేసుకుందా మనుకుంటే రాత్రి 12 గంటలకు సైటు ఓపెన్ అవుతుందని, గంటలోపు బుకింగ్ ముగుస్తుందని, దాని వలన యాజమానులు, కార్మికులు ఇబ్బంది పడుతున్నామని, వెబ్ సైట్ పగలు ఓపెన్ అయ్యేలా చూడాలని కోరుతున్నామని అన్నారు. దీనిపై ఎమ్మెల్యే అంజిబాబు స్పందించి వెంటనే ఈ సమస్యను జిల్లా కలెక్టర్ నాగరాణి దృష్టికి తీసుకుని వెళ్లి సమస్యను పరిష్కరిస్తామని, కార్మికులకు న్యాయం చేయడమే కూటమి లక్ష్యమని అన్నారు.
