సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) కు ఒక నేడు ఆదివారం కీలక రోజు కానుంది. దేశంలోనే తొలిసారి అత్యంత బరువైన,అంటే 4వేల 400 కిలోల బరువున్న కమ్యూనికేషన్ ఉపగ్రహం, CMS-03, ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి నేడు ప్రయోగించనుంది. అత్యంత బరువైన పేలోడ్లను అంతరిక్షంలోకి మోసుకెళ్లగల LVM3-M5 రాకెట్ ప్రయోగానికి సిద్ధమవుతోంది. ఈ రాకెట్‌ను శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ రెండో ప్రయోగ వేదిక నుంచి నేడు నవంబర్ 2 సాయంత్రం 5.26 గంటలకు ప్రయోగించనున్నారు. ఇది మొత్తం 25 గంటలు 30 నిమిషాలు కొనసాగుతుంది. ప్రయోగం ప్రారంభమైన 16.09 నిమిషాల తర్వాత ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెడతారు.
