సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇంటర్ మీడియట్ విద్యార్థులు తమ తదుపరి ఉన్నత చదువులకై.. తెలంగాణ రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికిగానూ ఇంజినీరింగ్, ఫార్మా, బీఎస్సీ అగ్రికల్చర్, వెటర్నరీ సైన్స్‌ తదితర కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఈఏపీసెట్‌ 2025 నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ మేరకు పూర్తి నోటిఫికేషన్‌ను ఉన్నత విద్యా మండలి (TGCHE) తాజగా విడుదల చేసింది. ఇందుకోసం జేఎన్‌టీయూహెచ్‌ వెబ్‌సైట్‌ను కూడా అందుబాటులోకి తీసుకు వచ్చింది. తాజా నోటిఫికేషన్‌ ప్రకారం ఫిబ్రవరి 25వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది. ఎటువంటి ఆలస్య రుసుం లేకుండా ఏప్రిల్‌ 4 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రూ.2,500, రూ.5 వేల ఆలస్య రుసుం చెల్లించి దరఖాస్తు చేసుకున్నవారికి హైదరాబాద్‌లోని జోన్‌ 4లో మాత్రమే పరీక్షా కేంద్రాలు కేటాయిస్తారని నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఇక మే 2 నుంచి 5 వరకు ఇంజినీరింగ్‌ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. అలాగే ఏప్రిల్‌ 29, 30 తేదీల్లో అగ్రికల్చర్‌, ఫార్మా పరీక్షలు నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి స్పష్టం చేసింది.అయితే ఈ ఏడాది తెలంగాణ ఈఏపీసెట్‌ 2025 పరీక్ష ను ఆంధ్ర ప్రదేశ్ విద్యార్థులు రాయాలా? వద్దా? అనే దానిపై ఏపీ విద్యార్ధుల్లో గందరగోళం నెలకొంది. నాన్‌ లోకల్‌ కోటా విభాగంలో ప్రవేశాలకు సంబంధించి అర్‌హతలపై ప్రభుత్వం నుంచి స్పష్టత కొరవవడమే ఇందుకు కారణంప్రభుత్వం ఇచ్చే ఉత్తర్వులకు లోబడే 15 శాతం నాన్ లోకల్‌ విభాగంలో ప్రవేశాలు ఉంటాయని నోటిఫికేషన్‌లో పేర్కొనడం గమనార్హం. అయితే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమయ్యే లోపు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేస్తుందని భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *