సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విశాఖపట్నం లో పర్యాటక ప్రాంతం భీమిలి బీచ్‌లో నేడు, శుక్రవారం ఈతకు వెళ్లిన ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు గల్లంతు అయ్యారు. తగరపువలస అనిట్స్ ఇంజనీరింగ్ కాలేజ్‌కి చెందిన సూర్య, సాయి గల్లంతు అయినట్లు తోటి విద్యార్థులు చెబుతున్నారు. విద్యార్థుల ఆచూకీ కోసం గాలింపు చేపట్టినట్లు నేవీ, కోస్ట్ గార్డ్ సిబ్బంది తో పాటు బీచ్ దగ్గర గజ ఈతగాళ్లతో గాలింపు చేపట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు.( ఫై చిత్రంలో చూడవచ్చు) బీచ్‌కు వెళ్లిన ఏడుగురు విద్యార్థుల్లో ఇద్దరు గల్లంతు అయ్యారు. ఆ ప్రాంతం అంతటా విషాదం నిండిపోయింది.
