సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజగా నేడు, మంగళవారం ప్రముఖ దిన పత్రిక ఈనాడు పై ప్రాసిక్యూషన్ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ ప్రభుత్వం చిత్త శుద్దితో పోలవరం ప్రాజెక్ట్ పూర్తీ చెయ్యడానికి అవినీతి కి దూరంగా సమర్ధవంతంగా పనిచేస్తున్నప్పటికీ ప్రభుత్వ ప్రతిష్ట ను దిగజార్చేలా ఈనాడు పత్రిక తప్పుడు రాతలు రాస్తోందని ఆరోపిస్తూ.. ఆ సంస్థపై పరువు నష్టం దావా వేయాలని ఆదేశించింది. ఆ ఆదేశాలలో మే 12వ తేదీన పోలవరంపై ఈనాడు పత్రిక రాసిన కథనాలపై ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి ఈనాడు ఎం డీ, జర్నలిస్టుల ఫై క్రిమినల్ ప్రాసిక్యూ షన్ ఆఫ్ డిఫమేషన్ చర్యలకు ప్రభుత్వం ఆదేశించింది.
