సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్లమ్మ వారి వార్షిక మహోత్సవాలు వచ్చే జనవరి నెల 13 నుంచి జరగనున్న నేపథ్యంలో ఆలయంలో ప్రతి ఏడాదిలానే రంగులు వేసి సుందరీకరణ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 11 నుంచి 25 వరకు గర్భాలయంలో శ్రీ అమ్మవారి మూల విరాట్ దర్శనం నిలిపివేస్తున్నట్లు ఆలయ సహాయ కమిషనర్ బుద్ధా మహాలక్ష్మినగేష్ తెలిపారు. అయితే భక్తులకు దేవాలయంలో ప్రవేశం ఉంటుంది.ఈనెల 11న ఉదయం 11 గంటలకు అమ్మవారి కళాపకర్షణ చేస్తారని, 24 వరకు ఉత్సవమూర్తికి నిత్య పూజలు, కైంకర్యాలు నిర్వహిస్తారని తెలిపారు. మరల 25న ఉదయం విశేష పూజల అనంతరం అమ్మవారి కళలను విగ్రహంలో నిక్షిప్తం చేసి కుంభ, గో, దర్పణ దర్శనం కార్యక్రమాలను నిర్వహించి భక్తులకు బంగారు తల్లి నిలువెత్తు మూల విరాట్ దర్శనం కలిగిస్తామని తెలిపారు
