సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడుతోంది. దీని ప్రభావంతో ఈనెల 11 నుంచి నాలుగు రోజులపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురవనున్నాయి. హిందూ మహాసముద్రంలో అల్పపీడనం కొనసాగుతోందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా పయనించి రానున్న 24 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందన్నారు. ఈనెల 11నాటికి శ్రీలంక-తమిళనాడు తీరాలకు ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలోకి చేరే అవకాశముందన్నారు. దీని ప్రభావంతో డిసెంబర్ 15 వరకు కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందన్నారు. ఈ నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. రైతులు ఇప్పటికే పంట కోసి ధాన్యాన్ని రాసులుగా పోసి ఉంటే ఆ ధాన్యం వర్షాలకు తడవకుండా కాపాడేందుకు వెంటనే అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
