సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భారతీయ రైల్వేలలో వాల్టేర్ డివిజన్ ది ప్రత్యేక స్థానం . విశాఖ జంక్షన్ మీదుగా రోజూ 120 రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. విశాఖ పట్నంకు వందేభారత్” రైళ్లు క్యూ కడుతున్నాయి. ఎల్లుండి సోమవారం నుంచి మరో 2 కొత్త వందేభారత్”సర్వీసులు ప్రారంభిస్తున్నారు. ఈనెల 16న రెండు కొత్త సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. వీటిలో ఒకటి సికిం ద్రాబాద్ -నాగ్పూర్ మధ్య కాగా మరొకటి విశాఖ- ఛతీస్ గడ్ లోని దుర్గ్ జంక్షన్ మధ్య పరుగులు పెట్టనున్నాయి. దింతో వందే భారత్ లు హైదరాబాద్కు ఐదు, విశాఖకు నాలుగుకు పెరిగినట్టు అవుతుంది. .
