సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రేపు చంద్రబాబు సీఎంగా , పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం జరిగిన తరువాత ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. నాలుగు రోజులు సమావేశాలు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మొదటి రోజు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, రెండో రోజు స్పీకర్ ఎన్నిక (స్పీకర్ గా రఘురామా కృష్ణంరాజు ?)జరగనుంది. ఎన్నికల హామీ మేరకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉపసంహరణ బిల్లును అసెంబ్లీలో ఆమోదించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈసారి అసెంబ్లీ లో పవన్ కళ్యాణ్ ప్రత్యేక ఆకర్షణగా మారనున్నారు. ప్రధాన ప్రతిపక్షం లేకుండానే ఈసారి ఏపీ అసెంబ్లీ సాగనున్నాయి. రాష్ట్రంలో సుమారు 40 శాతం ఓటింగ్ ఉన్నపటికీ ఎదో మాయగా కేవలం 11 సీట్లు రావడంతోప్రతిపక్ష హోదా కూడా కోల్పోవడంతో జగన్‌కు సీటు ఎక్కడ కేటాయిస్తారోననే ఆసక్తి నెలకొంది. అసలు జగన్ అసెంబ్లీ కి వస్తారో ? లేదో అన్న దానిపై అనుమానాలు ఉన్నాయి. ఆంధ్ర తమిళనాడు రాజకీయాలలో అసెంబ్లీ కి దూరమైన ప్రతిపక్ష నేతలు తిరిగి అధికారంలోకి రావడం కూడా ఒక సెంటిమెంట్ గా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *