సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ లో మరో 30 రోజులలో జరగనున్న అసెంబ్లీ మరియు లోక్ సభ ఎన్నికలకు ఇప్పటికే ఎన్నికల నగారా మ్రోగి రాజకీయపార్టీల అభ్యర్థుల ప్రచార పర్వము హోరెత్తిస్తుండగా.. ఎన్నికలలో కీలకమైన అభ్యర్థుల నామినేషన్ ఘట్టం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగానే ఈ నెల 18 నుండి ప్రారంభం కానుంది. మరో 6 రోజులల్లో అభ్యర్థుల నామినేషన్స్ కోలాహలం సందడి చేయనుంది. ఆ దిశగా పశ్చిమ గోదావరి జిల్లాలో అధికారులు ఏర్పాట్లు పూర్తీ చేస్తున్నారు. ఇప్పటికే అనుమానిత నగదు, మద్యం, పెద్దఎత్తున సీజ్ చేశారు. కీలక ప్రాంతాల్లో చెక్ పోస్టులతో నిఘా పెంచారు. పోలింగ్ కేంద్రాలు, కౌంటింగ్ కేంద్రాలను దశల వారీగా పరిశీలిస్తున్నారు. వచ్చే మే నెల 13న జరగనున్న ఓటర్లు పోలింగ్ కోసం.. జిల్లా వ్యాప్తంగా ఏయే పోలింగ్ బూత్ లో ఏ ఏజెంట్ ఉండాలోపోలింగ్ బూత్ లలో ఎవరు ఏజెంట్స్ ఉండాలో, ఓటర్లు లిస్టుల తనిఖీలతో సహా ఇప్పటికే అధికార వైసీపీ నేతలు ప్యూహాత్మకంగా సిద్ధం చేసుకొంటుండగా, మిగతా కూటమి పార్టీలు ఇంకా టికెట్స్ సయ్యాలాటలతో , మార్పుల చేర్పుల అనుమానాలతో సతమతమౌతున్నాయి. మరో నెలరోజులలో ఎన్నికల నేపథ్యంలో .. త్వరితంగా అభ్యర్థుల ఎంపిక పూర్తీ చేసుకొని ఎన్నికల కమిషన్ నియమాలు పాటిస్తూ.. ప్రశాంత అన్ని పార్టీలు ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలలో పాల్గొనవలసి ఉంది.
