సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా గత శనివారం పొడి వాతావరణం నెలకొంది. దీంతో ఎండ తీవ్రత కాస్త పెరిగింది. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.నేడు, ఆదివారం కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుతాయని పేర్కొంది. కాగా, ఆగ్నేయ బంగాళాఖాతం.. దానికి ఆనుకుని అండమాన్‌ సముద్రం, ఇంకా శ్రీలంక సమీపాన నైరుతి బంగాళాఖాతంలో వేర్వేరుగా ఉపరితల ఆవర్తనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ నెల 20వ తేదీన దక్షిణ కోస్తా, 21 నుంచి 23 వరకు కోస్తాలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వివరించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *