సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కేంద్ర గృహ నిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ మరియు స్వచ్బ ఆంధ్ర కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నేషనల్ యాక్షన్ ఫర్ మేకనైజ్డ్ శానిటేషన్ ఎకోసిస్టమ్ (NAMASTE) పథకం ద్వారా భీమవరం పట్టణం మరియు సమీప ప్రాంతాలలో రోడ్లు/వీదులు వెంబడి చెత్తను ఏరుకునేవారు, ఇంటింటికి వెళ్ళి వాహనాల ద్వారా చెత్తను సేకరించి అమ్ముకునేవారు మరియు పారిశుద్ధ కార్మికులు మొదలైన వారికి వృత్తిపరమైన గుర్తింపు కార్డులు, పిపిఈ కిట్లు, సామాజిక, ఆర్ధిక మరియు ఆరోగ్య భద్రత ప్రయోజనాలు మరియు నైపుణ్య మెరుగుదల కొరకు తగిన శిక్షణ అందజేయు నిమిత్తం ఈనెల 21 22 మరియు 23 తేదీలలో భీమవరం పురపాలక సంఘ కార్యాలయం నందు ఉదయం గం.10.00 ల నుండి మధ్యాహ్నం గం.2.00 ల వరకు ప్రత్యేక క్యాంపు ద్వారా సర్వే నిర్వహించడం జరుగుతుంది. చెత్తను సేకరించి అమ్ముకునేవారు ఈ క్యాంపు నందు తమ యొక్క ఆధార్ కార్డు, బ్యాంక్ అక్కౌంట్ మరియు ఇతర ఏదైనా గుర్తింపు కార్డుల ద్వారా తమ పేరును నమోదు చేసుకొని ప్రభుత్వము వారి ద్వారా తగిన సామాజిక, ఆర్ధిక మరియు ఆరోగ్య భద్రత ప్రయోజనాలు పొందగలరని భీమవరం మునిసిపల్ కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు.
