సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ లో భారీ మార్పులు చేసిన నేపథ్యంలో చాలా రకాల వస్తువుల ధరలు ఒక్కసారిగా దిగివస్తాయి. ఈ మార్పులు సెప్టెంబర్ 22, 2025 నుంచే అమలులోకి వస్తున్నాయి. అప్పటి నుంచి ధరలు తగ్గుతాయని అందరికి తెలిసిందే. ముఖ్యంగా ఈ ప్రభావం పేద, మధ్య తరగతి ప్రజలపై అధికంగా ఉంటుంది. సబ్బులు, షాంపులు, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గడం ద్వారా వారిపై భారం తగ్గనుంది. అయితే, తగ్గించిన కొత్త ఎంఆర్పీ (MRP) ధరల తో వస్తువులు మార్కెట్లోకి వచ్చేందుకు చాలా సమయం పడుతుందని అంటున్నారు. ఈ క్రమంలో సెప్టెంబర్ 22వ తేదీ తర్వాత ఏ వస్తువు కొన్నావాటి ధరల విషయంలో ( కారులు, ఏసీలు, టివిలు, సబ్బులు షాంపూలు ఏవైనా సరే )తగ్గిన ధర తెలుసుకునేలా స్థానిక దుకాణాల్లో సెప్టెంబర్ 22కు ముందు తయారై ప్యాకింగ్ చేసిన వస్తువులపై కొత్త ఎంఆర్పీతో స్టిక్కర్లు అతికించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. అయితే, పాత ఎంఆర్పీ కనిపించేలా ఉండాలని స్పష్టం చేసింది. అంటే పాత, కొత్త ఎంఆర్పీ ధరలు వస్తువుపై కనిస్తాయి. దీంతో వినియోగ దారులు అయోమయానికి గురికారు.
