సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్థాపించి 100 సం పూర్తి అయిన సందర్భంగా దేశవ్యాప్తంగా హిందూ సమ్మేళనాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు అన్నారు. నేడు, గురువారం ఎమ్మెల్యే కార్యాలయం వద్ద హిందూ సమ్మేళన కరపత్రాన్ని ఎమ్మెల్యే అంజిబాబు ఆవిష్కరించారు. కార్యక్రమ కార్యదర్శి గొంతిన శ్రీనివాస్, కోశాధికారి రావూరి అనంత్, గాంధీ, మాట్లాడుతూ ఈనెల 25న ఉదయం 10 గంటలకు భీమవరం కృష్ణదేవరాయ కళ్యాణ మండపంలో హిందూ సమ్మేళనం జరుగుతుందని, శృంగవృక్షం దత్తపీఠం 5వ పీఠాధిపతి శ్రీసాయి దత్త నాగానంద సరస్వతి స్వామీజీ వస్తున్నారన్నారు. అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి సమ్మేళనం ప్రోగ్రాంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేసారు.
