సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ లో ఈ ఫిబ్రవరి నెల 26వ తేదీ మహా శివరాత్రి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా సెలవు ఉండగా ఫిబ్రవరి 27న ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే జిల్లాలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉమ్మడి పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి, జిల్లాలలో గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని పాఠశాలలకు ఫిబ్రవరి 27న సెలవు ఉంటుంది. ఉపాధ్యాయులు, డిగ్రీ పూర్తీ చేసిన గ్రాడ్యుయేట్లు ఎమ్మెల్సీ స్థానాలకు ఓటు వేయడానికి అర్హులు కావున వారి ఓటు హక్కు వినియోగించడానికి వారి ఉపాధ్యాయ ఉద్యోగాలకు ఇబ్బంది లేకుండా అధికారికంగా సెలవు ప్రకటించారు.
