సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి భీమవరంలోని కలెక్టరేట్ లో అధికారులతో మాట్లాడుతూ.. రాష్ట్ర కుల గణన సర్వే పై అవగాహన కార్య క్రమం ఎంతో సున్ని తమైన అంశమని, ప్రజల నుండి ఓపిగ్గా విషయాన్ని సేకరిం చాలని కలెక్టర్ సూచించారు. ఈనెల 27 నుంచి డిసెంబర్ 10 వరకు జిల్లాలో కులగణన నిర్వహించా లన్నారు. దీనికి జిల్లా యంత్రాంగం సిద్ధం కావాలని ఆదేశించారు. కులగణన గురించి ముం దుగానే వలంటీర్ల ద్వారా ఇంటింటి ప్రచారం నిర్వహించి, ప్రజలలో అపోహలను తొలగించాలని సూచించారు. సర్వే లో కుటుంబ సభ్యులు చెప్పిన వివరాలనే నమోదు చేయాలని, వాటికి సంబంధించిన ధ్రువప్రతాలను అడగాల్సిన అవసరం లేదన్నారు. కులాం తర వివాహాలు చేసుకున్న వారికి, ఎవరి కులం వారికే నమోదు చేయాలన్నారు. ఎవరైనా కులం పేరు చెప్పడానికి ఇష్టపడకపోతే, వారిని బలవంతం చేయవద్దని, ఇది స్వచ్ఛందమేనని పేర్కొన్నారు.
