సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశంలో పన్నులు చెల్లించేవారికి ట్యాక్స్‌లు కట్టే వారికి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆధార్‌ను పాన్ కార్డుతో లింక్ చేయడానికి తాజాగా నేడు, గురువారం.. ఓ డెడ్ లైన్ విధించింది. 2025, డిసెంబర్ 31వ తేదీలోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సిందేనని స్పష్టం చేసింది. ఆధార్‌ను పాన్‌తో లింక్ చేయకపోతే 1000 రూపాయలు ఫైన్ కట్టాల్సి వస్తుందని హెచ్చరించింది.ఎవరైతే 2024, అక్టోబర్ 1వ తేదీకి ముందు ఆధార్ ఎన్రోల్మెంట్ ఐడీ ఉపయోగించి పాన్ కార్డు పొందారో వారు కచ్చితంగా ఆధార్ – పాన్ లింకింగ్ చేయాల్సిందే. ఒక వేళ ఆధార్ – పాన్ లింకింగ్ 2025, డిసెంబర్ 31వ తేదీలోగా చేయకపోతే వారి పాన్ కార్డు 2026, జనవరి 1వ తేదీనుంచి పని చేయకుండా పోతాయి. ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయాలన్నా, రీఫండ్స్ తీసుకోవాలన్నా, బ్యాంక్ లావాదేవీలు చేయాలన్నా ఇబ్బందులు ఎదురుకానున్నాయి.
