సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పల్లెల్లో సైతం పశుపోషణ నానాటికి తగ్గుతున్న పరిస్థితుల్లో పశుపెంపకం చేపట్టాలిసిన ఆవశ్యకత ఏర్పడిందని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ చైర్మన్, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. నేడు, సోమవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరాల పోస్టర్ ను ఎమ్మెల్యే అంజిబాబు ఆవిష్కరించారు. ఈనెల 31వ తేదీ వరకు గ్రామాల్లో పశు ఆరోగ్య శిబిరాల, అవగాహనా సదస్సులు నిర్వహిస్తారని, నట్టల నివారణ మందుల పంపిణి, గర్భకోశ వ్యాధులకు చికిత్స, పశు వ్యాధి నిర్ధారణ పరీక్షలు, వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాలు, పశు విజ్ఞానంపై అవగాహనా సదస్సులు జరుగుతాయని తెలిపారు. పశు పోషకుల ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు అందించాలని అన్నారు. కార్యక్రమంలో పశు సంవర్ధక శాఖ ఏరియా సహాయ సంచాలకులు డా సుధీర్ బాబు, గుట్లాపాడు పశు వైద్య అధికారి డా పుండరి బాబు, వెంప పశు వైద్యులు డా మౌర్య సత్యేంద్ర, కూటమి నేతలు పాల్గొన్నారు.
