సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గ్రంధి శ్రీనివాస్, పశ్చిమ గోదావరి జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి కృష్ణారెడ్డితో సమీక్ష నిర్వహించారు. తదుపరి ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత ఆధునిక యుగంలో నూతన టెక్నాలజీ పై ప్రతి ఒక్కరు పట్టు సాధించే దిశగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకోవడం జరిగిందని అన్నారు. ఇందులో భాగంగానే ఈనెల 10 వ తేదీన భీమవరం ఐటిఐ కాలేజీలో స్కిల్ డెవలప్మెంట్ కు సంబంధించి స్కిల్ హబ్ ను ప్రభుత్వం నిర్వహిస్తుందని అన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి విద్యార్థి కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ముఖ్యంగా ఆరోజున ఏసి టెక్నీషియన్ కి సంబంధించి స్కిల్ హబ్ జరుగుతుందని అన్నారు. ప్రభుత్వం ప్రతి ఒక్కరికి బంగారు భవిష్యత్తు కల్పించాలనే దిశగా వచ్చే నెలలో భీమవరంలో పెద్ద ఎత్తున నిరుద్యోగులకు ఉద్యోగ మేళ కూడా నిర్వహించడం జరుగుతుందని ఆయన అన్నారు. ఇక భవిషత్తు కాలంలో ప్రతి విద్యార్థి ఎదో ఒక రంగంలో స్కిల్ డెవలప్మెంట్ కలిగి ఉన్నప్పుడే ఉన్నత ఉద్యోగ అవకాశాలను దక్కించుకోవడానికి అవకాశం ఉంటుందని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ప్రకటించారు.
