సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ఈనెల 19వ తేదీ నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నెల 7న రాష్ట్ర మంత్రి వర్గ సమావేశంలో కేబినెట్ అజెండా ను నిర్ణయించే అవకాశముంది. 19వ తేదీ నుంచి వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎన్ని అడ్డంకులు వచ్చిన జగన్ సర్కర్ ప్రతిష్టాకరంగా తీసుకొన్న మూడు రాజధానుల బిల్లు మళ్లీ పకడ్బందీగా ప్రవేశపెట్టే అంశంపై 7న జరగనున్న మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. ప్రస్తుతం శాసనమండలి లో కూడా వైసిపి ఎమ్మెల్సీ ల బలం బాగా పెరిగి పూర్తీ ఆధిక్యతలో ఉంది..అయితే మూడు రాజధానుల బిల్లు తీసుకువచ్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని గతంలో హైకోర్టు కొన్ని అభ్యన్తరాలు వ్యక్తం చేసింది.. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాజధానులు నిర్ణయించుకొనే అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిదే అంటూ జాతీయస్థాయి లో చట్టం తెచ్చే పనిలో తాము సఫలీకృతులం అవుతామని జగన్ సర్కార్ ధీమాగా ఉన్నట్లు ఇటీవల జరుగుతున్నా పరిణామాలు నేపథ్యంలో భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *