సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత 3 రోజులుగా స్టాక్ మార్కెట్ లో భారీ నష్టాల పరంపర కొనసాగుతూనే ఉంది. నేడు, బుధవారం కూడా దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. నిజానికి కాస్త అటు ఇటు తప్ప దాదాపుగా గత్ 3 వారాలుగా ఇదే పరిస్థితి కొనసాగుతుండటంతో మదుపరులు అందరిలో నైరాశ్యం నెలకొంది. బీఎస్ఈ సెన్సెక్స్ 984.23 పాయింట్లు నష్టపోయి 77690.95 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 324 పాయింట్ల నష్టంతో 23,559.05 దగ్గర స్థిరపడింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాల నేపథ్యంలో బ్యాంక్, ఆటో స్టాక్స్ అమ్మకాలు సూచీలను పడేశాయి. టామోటార్స్, ఎన్టీపీసీ, ఏషియన్ పెయింట్స్, ఇన్ఫోసిస్ లాభాల్లో ట్రేడయ్యాయి. ఐటీసీ, టైటాన్, హెచ్సీఎల్ టెక్, టెక్ మహీంద్ర, మారుతీ, టీసీఎస్, ఐసీఐసీఐ, రిలయన్స్, కోటక్ మహీంద్ర షేర్లు నష్టాలతో ముగిశాయి.
